గాంధీజీ వర్ధంతి: అహింస, సత్యం మార్గాలు నేటికీ అవసరం

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలో శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వతంత్య్ర పోరాటంలో గాంధీజీ పాత్రను, అహింస, సత్యం, శాంతి మార్గాలు నేటి సమాజానికి ఎంతగానో అవసరమని నేతలు గుర్తు చేశారు. కస్తూరి విశ్వనాధం నాయుడు, మాచినేని విశ్వేశ్వరావ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో, గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం గాంధీజీ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. గాంధీజీ జీవిత చరిత్ర, త్యాగాలు యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.

సంబంధిత పోస్ట్