కోడూరు పీఏసీఎస్ కమిటీ సభ్యులుగా తుపాకుల పెంచలయ్య

రైల్వే కోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడిగా చిట్వేలి మండలం గట్టుమీదపల్లెకు చెందిన తుపాకుల పెంచలయ్యను శుక్రవారం నియమించారు. ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులతో కమిటీ ఏర్పాటు కాగా, చైర్‌పర్సన్‌గా మైసూరువారిపల్లెకు చెందిన పగడాల వరలక్ష్మి ఎంపికయ్యారు. జనసేన కార్యకర్తగా పార్టీ ఆవిర్భావం నుంచే క్రియాశీలంగా ఉన్న పెంచలయ్యకు ఈ పదవి జనసేన నాయకుల సిఫారసుతో లభించింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్