కోడూరు: SIR’పై అప్రమత్తంగా ఉండాలి: కొరముట్ల

ఈ నెల 15 నుండి జూలై 14 వరకు జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై వైఎస్సార్‌సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సూచించారు. బుధవారం కోడూరు పార్టీ కార్యాలయంలో జరిగిన మండల బీఎల్ఏల సమావేశంలో కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అజయ్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. నెల రోజుల పాటు సాగే ఈ ప్రక్రియలో కొత్త ఓట్ల చేరికలు, పాత ఓట్ల తొలగింపులను బీఎల్ఏలు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్