కోడూరు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

రైల్వే కోడూరు మండలంలోని విద్యానగర్‌లో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పాములేటి వెంకటరమణమ్మ ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ఇంట్లోని సామాగ్రి అంతా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో ప్రమాదం పక్క ఇళ్లకు వ్యాపించకుండా నివారించగలిగారు. ఈ ప్రమాదంలో బాధితురాలికి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానిక రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్