కోడూరు: వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

రైల్వే కోడూరు నియోజకవర్గం శెట్టిగుంట వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముద్దపోలు వెంకటయ్య (56) అనే వ్యక్తి మృతి చెందాడు. కోడూరు మామిడికాయల మార్కెట్ నుండి ఇంటికి బైక్‌పై వస్తుండగా, తిరుపతి వైపు నుంచి వచ్చిన మ్యాక్స్ వాహనం బలంగా ఢీకొట్టడంతో వెంకటయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్