ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభదాయకం: శాస్త్రవేత్త సందీప్ నాయక్

రైల్వే కోడూరు అనంతరాజుపేట హార్టికల్చర్ కళాశాల సీనియర్ శాస్త్రవేత్త సందీప్ నాయక్ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం వల్ల రైతులకు ఆర్థికంగా లాభాలు చేకూరుతాయని, సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని తెలిపారు. మంగళవారం స్థానిక వ్యవసాయ అధికారి కార్యాలయంలో 'ఆత్మ' ఆధ్వర్యంలో నిర్వహించిన 'కిసాన్ గోష్టి' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, మైక్రో ఇరిగేషన్ వంటి అంశాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్