మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ చిట్వేల్ కేజీబీవీ పాఠశాలలో ప్రిన్సిపాల్ తులసి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామాంజులు, ఎస్సై నవీన్ బాబు, సీడీపీవో నిర్మల, దాతలు, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోటీలను నిర్వహించి తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. అతిథులు యాజమాన్యాన్ని అభినందించారు.