మహాత్ముని ఆశయాలను స్మరించుకుంటూ ప్రజాసేవ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. రైల్వే కోడూరు పట్టణంలోని టోల్ గేట్ వద్దగల గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చూపిన సత్యం, త్యాగం, అహింస మార్గాలు నేటి తరానికి ఆదర్శంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.