పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద మామిడికాయ లారీ ఆదివారం రాత్రి అదుపుతప్పి కట్టకింద బోల్తా పడటం 9 మంది వలస కూలీలు అక్కడక్కడ మృతి చెందడం బాధాకరమని, ప్రభుత్వం వారికి మృతులకు 25 లక్షలు, గాయపడిన వారికి, 10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, సిహెచ్ చంద్రశేఖర్, చిట్వేల్ రవికుమార్ సోమవారం డిమాండ్ చేశారు. గాయపడిన వారిని, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు.