రైల్వే కోడూరు: మానవత్వం చాటుకున్న బోలాశంకర్ సేవా సమితి

అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు పట్టణంలోని చిట్వేల్ రోడ్ ప్రాంతంలో బుధవారం విద్యుత్ ఘాతానికి గురైన శ్రామికుడు శ్రీనివాసుల స్థితిని విలేకరి ద్వారా తెలుసుకున్నారు. బోలా శంకర్ సేవా సమితి అధ్యక్షుడు మందల నాగేంద్ర తన బృందంతో కలిసి అక్కడికి చేరుకుని అతనికి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు. ప్రజలు మానవత్వం చాటిన సమితికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్