రైల్వే కోడూరు: ఖొమైనీ హత్యను ఖండించిన సిపిఐ

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖొమైనీ, ఆయన కుటుంబ సభ్యులపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిని సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి బుధవారం తీవ్రంగా ఖండించారు. రైల్వే కోడూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రంప్, నెతన్యాహు సైన్యాలు టెహరాన్ లోని అధ్యక్ష భవనంపై బాంబుల వర్షం కురిపించి ఈ దుర్మార్గానికి ఒడిగట్టాయని మండిపడ్డారు. అరబ్ దేశాల ఆయిల్ కోసం అమెరికా సామ్రాజ్యవాదానికి పాల్పడుతోందని, ప్రధాని మోదీ ఈ ఘటనను ఖండించకపోవడం విచారకరమని విమర్శించారు.

సంబంధిత పోస్ట్