ధరలు తగ్గించి బొప్పాయి రైతులను ఢిల్లీ సేట్లు నిండా ముంచుతున్నారని రైల్వేకోడూరుకు చెందిన బొప్పాయి దళారి రామసుబ్బయ్య ఆరోపించారు. అందువల్ల గురువారం ఉదయం రైతులు, దళారులు కలిసి బొప్పాయి లారీలను అడ్డుకొని నిరసన తెలుపుతున్నామని అన్నారు. రూ. 17 ఉన్న ధరను రూ. 7కు తగ్గించారని, అందుకు నిరసనగా ధర్నా చేస్తున్నామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు బండ్లను కదలనీయమన్నారు.