రైల్వే కోడూరు: ఐచర్ వాహనం బోల్తా

రైల్వే కోడూరు సమీపంలో పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద మామిడికాయల లోడ్‌తో వెళ్తున్న ఐచర్ లారీ అదుపు తప్పి  బోల్తా పడింది. అయితే ఈ సమయంలో లారీలో 19 కూలీలు ఉన్నాట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో 10 మందిని బయటకు తీసి 108 వాహనంలో రాజంపేట ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు మృతి చెందారు. మిగిలిన కూలీల సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్