అన్నమయ్య జిల్లాలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ముఖ్యంగా చిట్వేలు మండలంలో చిరుజల్లులతో వాతావరణం చల్లబడింది. దీనితో చలి పెరిగి, ఉదయాన్నే పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వ్యవసాయ పనులు, రోజువారీ కూలీ పనులపై ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.