రైల్వే కోడూరు పంచాయతీ కార్యాలయంలోకి వర్షపు నీరు, సిబ్బంది ఆందోళన

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలోకి భారీ వర్షపు నీరు చేరడంతో సిబ్బంది ఇసుక మూటలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నీరు లోపలికి వస్తుండటంతో కార్యాలయ సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగే వర్షం కురిస్తే కార్యాలయానికి ముప్పు వాటిల్లుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షానికి కడప రేణిగుంట ప్రధాన రహదారిపై కూడా నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్