కోడూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రుల పర్యటన, వి. బి. జి రాంజీ గ్రామీణ పథకం ప్రారంభోత్సవ సభ విజయవంతం కోసం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎన్డీఏ నాయకులతో సభ ఏర్పాట్లు, బాధ్యతల కేటాయింపు, ప్రజల భాగస్వామ్యం, సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. అన్ని మండలాల ఎన్డీఏ నాయకులు నిర్ణీత సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రూపానంద రెడ్డి కోరారు.