పుల్లంపేట మండలం టి. కమ్మపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పారిశ్రామికవేత్త, రిజెన్సీ స్టైల్స్ చైర్మన్ జి. ఎన్. నాయుడు బుధవారం అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందారు. 28-04-1938న జన్మించిన ఆయన ఇటీవలే 88వ ఏటిలోకి ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుడిగా, స్వర్గీయ ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఆయన మృతితో పరిశ్రమల రంగంలో, రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. జి. ఎన్. నాయుడు అంత్యక్రియలు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.