పాత చిట్వేలు గ్రామంలోని శ్రీ వరదరాజస్వామి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ పవిత్రోత్సవంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ముక్కా వరలక్ష్మి ఆలయ అభివృద్ధి సమాజానికి ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు.