చిట్వేల్‌లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

చిట్వేల్‌లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలకు శనివారం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండల అధ్యక్షుడు నాగార్జున నాయుడు ఆధ్వర్యంలో మార్చి 29న నాగవరం నుంచి ఎన్టీఆర్ నగర్ వరకు పసుపు పండుగగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం వివిధ గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు, అనంతరం భారీ సభ జరగనుంది. పార్టీ స్థాపకుడు నందమూరి తారకరామారావుకు నివాళులు అర్పించనున్నారు. కార్యకర్తలంతా ఏకతాటిపైకి వచ్చి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్