సిద్ధారెడ్డిపల్లిలో సుపరిపాలన తొలి అడుగు, డోర్ టు డోర్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముక్కా రూపానంద రెడ్డి పాల్గొన్నారు. గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుని, పరిష్కారానికి హామీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామంలో ప్రతి ఒక్కరిని పలకరించి, వారికి ఎదురవుతున్న సమస్యలు తెలుసుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రజల అభివృద్ధి ప్రాధాన్యం. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.