తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త తేనేపల్లి నరసింహులు (చిన్న)ను రైల్వే కోడూరు నియోజకవర్గం కోడూరు మండల తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీగా పార్టీ అధిష్టానం, సీనియర్ నాయకుల అభ్యర్థన మేరకు నియమించారు. ఈ సందర్భంగా నరసింహులు అమరావతి రాజధాని రూపకర్త, ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్, స్థానిక సీనియర్ నాయకులు, రాష్ట్ర చైర్మన్ చౌదరి, నియోజకవర్గ సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ పదవిని పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.