రైల్వే కోడూరులో కుండపోత వర్షం

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణ పరిసర ప్రాంతాలలో గత నాలుగు రోజులుగా భారీగా వర్షం కురుస్తోంది. ఉదయం 4 గంటల నుండి కురుస్తున్న వర్షానికి గుంజన నది నీటిమట్టం పెరిగి, కడప-రేణిగుంట ప్రధాన రహదారిపైకి చేరింది. ఈ వరద నీటితో చిరు వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రైతుల పొలాల్లోకి కూడా నీరు చేరి పంట నష్టం వాటిల్లుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్