చిట్వేల్ పట్టణ సమీపంలోని గుంజునేరులో శనివారం ఉదయం ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నాలుగు రోజుల క్రితమే మృతి జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.