కార్మికుడి మృతి.. రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి CITU

శుక్రవారం రాత్రి కోడూరులోని ప్రైవేట్ మామిడికాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న రవి అనే వలస కూలీ వాహనం ఢీకొని మృతి చెందాడు. వలస కూలీలకు కనీస నివాస సౌకర్యాలు కల్పించకపోవడమే ఈ ఘటనకు కారణమని సీఐటీయూ నాయకులు శనివారం రాత్రి ఆరోపించారు. కార్మికుల పరిస్థితులను పర్యవేక్షించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని సీఐటీయూ నాయకులు సీహెచ్ చంద్రశేఖర్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్