ఆకేపాటి, మేడా పేదల భూములను ఆక్రమించారు: చమర్తి

రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పేదల భూములను ఆక్రమించారని ఆరోపించారు. రాజంపేటలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మేడా మల్లికార్జున రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒంటిమిట్ట ఎత్తిపోతల పథకం కాంట్రాక్టు తీసుకుని నాసిరకం పైపులు వేశారని విమర్శించారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని, మేడా కుటుంబం ఏ పార్టీకి చెందినదో స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్