వైసీపీ నేతలపై భూ దోపిడి ఆరోపణలు చేసిన చమర్తి

రాజంపేటలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకుడు చమర్తి, వైసీపీ నాయకులపై ప్రభుత్వ భూములను ఆక్రమించి విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి అని, వాటిని ఆక్రమించడం సరికాదని ఆయన అన్నారు. భూ దోపిడీపై బహిరంగ చర్చకు వైసీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేస్తుందని చమర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్