ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం కళా వేదికపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామానికి చెందిన సుమారు 35 మంది చిన్నారులు భగవద్గీత పారాయణం చేసి భక్తులను ఆకట్టుకున్నారు. వందలాది భక్తుల సమక్షంలో స్పష్టమైన ఉచ్చారణతో శ్లోకాలు ఆలపించగా కార్యక్రమం భక్తిభావంతో నిండిపోయింది. చిన్నారుల ప్రతిభను టీటీడీ అధికారులు, భక్తులు ప్రశంసించారు. ఈ ప్రదర్శన ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణకు మంచి ఉదాహరణగా నిలిచింది.