సుండుపల్లెలో బడి పండుగలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని ఉపాధ్యాయులు శుక్రవారం పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జ్ హెచ్‌ఎం నాగార్జున ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులతో ర్యాలీ నిర్వహించి “ప్రైవేట్ బడి వద్దు. ప్రభుత్వ బడి ముద్దు” అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ బడుల్లో తల్లికి వందనం పథకం కింద రూ. 15,000, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, చిక్కీలు, రాగి జావ అందుబాటులో ఉన్నాయని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు సేవలందిస్తున్నారని వివరించారు.