ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. రాజంపేట మండలంలోని కె.బోయినపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన స్వయంగా పంపిణీ చేస్తారు. ప్రతి నెల ఒకటవ తేదీన ముఖ్యమంత్రి వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ నేరుగా పెన్షన్లు అందిస్తున్నారు. రేపటి కార్యక్రమం అనంతరం సాయంత్రం ఆయన తన ఉండవల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు.