డ్రైవర్ దారుణ హత్య.. అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం

కడప నగరంలో అక్కుపల్లి వంశీ (25) అనే యువకుడు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ నెల 10న తన యజమాని చింతా రామసుబ్బారెడ్డితో కలిసి బయటకు వెళ్లిన వంశీ అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, రెండు రోజుల గాలింపు తర్వాత శనివారం ఉదయం ఒంటిమిట్ట మండలం సాలాబాద్ సమీప అటవీ ప్రాంతంలో వంశీ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహంపై గాయాలుండటంతో ఇది హత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్