రాజంపేటలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం

రాజంపేట పట్టణంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు దిష్టిబొమ్మను టీడీపీ నాయకులు శనివారం దగ్ధం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం అంబటి రాంబాబుపై రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ ఘటనతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్