సిద్ధవటం మండలంలోని నేలనాపురం గ్రామంలో గురువారం గంగమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. మాజీ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, జాతర సందర్భంగా అమ్మవారిని పసుపు, కుంకుమతో అలంకరించి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు తెలిపారు. ఎస్సై హారిక ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు, కాలనీ నివాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు.