రాజంపేటలో నేడు భారీ ర్యాలీ

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట సాధన ఉద్యమం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో, బుధవారం రాజంపేటలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు జేఏసీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం పాత బస్టాండ్‌ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించనుంది. "రాజంపేటకు అన్యాయం జరుగుతోంది. నీలో ఏమాత్రం పౌరుషం, చీము, రక్తం ఉన్నా రేపు జరిగే ర్యాలీలో పాల్గొను" అని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఇప్పటికే పలువురు ఈ ర్యాలీలో పాల్గొంటారని సమాచారం.

సంబంధిత పోస్ట్