రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జలహారతి' వంటి మంచి కార్యక్రమాలపై అవాస్తవాలు ప్రచారం చేయడం తగదని కూటమి నాయకులు మండిపడ్డారు. గురువారం రాజంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఇడమడకల కుమార్ మాట్లాడుతూ, నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు చొరవతో కాలువల పూడికతీత పనులు చేపట్టడం వల్ల చెయ్యేరు నీరు చేరి మన్నూరు చెరువు జలకళ సంతరించుకుందని, ఓ పత్రికలో వచ్చిన అవాస్తవాలను ఖండించారు. ఈ కార్యక్రమంలో అన్ని కులాలకు చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారని, ప్రభుత్వంలో అందరికీ సమ ప్రాధాన్యం ఉందని స్పష్టం చేశారు.