పోలియో మహమ్మారిని తరిమికొడదాం: చమర్తి

రాజంపేటలో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెదేపా నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి, నూనెవారిపల్లెలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్