రాజంపేట పట్టణంలోని బీసీ బాలుర కళాశాల వసతి గృహంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో జరిగిన రాయలసీమ ప్రాంతీయ సదస్సు కరపత్రాలను జిల్లా అధ్యక్షులు నేతి నాగేశ్వర విడుదల చేశారు. ఫిబ్రవరి 4న కడప నగరంలోని యుటీఎఫ్ భవన్‌లో జరగనున్న ఈ సదస్సులో, రాయలసీమ విద్యార్థులు, యువజనుల విద్య, ఉపాధి హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాంతం వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉందని, శ్రీబాగ్ ఒప్పందం అమలు, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, విభజన హామీలు అమలు చేయాలని, రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.