తిమ్మారెడ్డిగారిపల్లెలో నడివీధి గంగమ్మకు సామూహిక పూజలు

సుండుపల్లి మండల పరిధిలోని ముడుంపాడు పంచాయతీ తిమ్మారెడ్డిగారిపల్లెలో ఆదివారం ఉదయం నడివీధి గంగమ్మ అమ్మవారికి సామూహిక పూజలు ఘనంగా జరిగాయి. గ్రామ మహిళలందరూ సాంప్రదాయ పద్ధతిలో పసుపు, కుంకుమ, వేపాకులతో అమ్మవారికి పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్