నందలూరు: సౌమ్యనాథ స్వామి సన్నిధిలో చమర్తి

నందలూరు సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సౌమ్యనాథస్వామి కళ్యాణం సందర్భంగా స్వామి వారికి టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్