ఒంటిమిట్ట ZPTC స్థానానికి అధికార పార్టీ టీడీపీ అభ్యర్థి ఎంపిక చేయకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. నామినేషన్‌కు ఇవాళ సాయంత్రం 5 గంటల వరకే గడువు ఉండటంతో మంత్రులు, నేతలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పులివెందుల, ఒంటిమిట్ట నుంచి వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ వేశారు. చివరికి టీడీపీ అభ్యర్థిని నిర్ణయిస్తుందో లేదో చూడాలి.