రాజంపేటలో ఆదివారం ఉదయం పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి బారులు తీరారు. కొన్ని బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు పెట్టడంతో గందరగోళం నెలకొంది. కొందరు యజమానులు అధిక ధరలకు ఇంధనం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొరత లేదని ప్రభుత్వాలు చెబుతున్నా, బంకుల్లో స్టాక్ లేకపోవడంపై వాహనదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.