సిద్ధవటం: కొండకు నిప్పు.. వన్యప్రాణుల మనుగడకు ముప్పు

సిద్ధవటం మండలం కడప ఫారెస్ట్ పరిధిలోని దెయ్యాలకోన సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కొండకు నిప్పు పెట్టారు. మంగళవారం రాత్రి చెలరేగిన మంటల్లో పచ్చని చెట్లు కాలిబూడిదయ్యాయి. అటవీ సంరక్షణపై అధికారులు అవగాహన కల్పిస్తున్నా, కొందరు కావాలనే ఇలా చేయడంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఈ చర్య వల్ల మూగజీవాలు, వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు కలుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్