సిద్ధవటం: స్మశాన వాటిక రహదారి శాశ్వత పరిష్కారం

సిద్ధవటం మండలం మాధవరం–1 ఆలీనగర్‌లో దాన సంస్కారాల స్మశానానికి రహదారి లేక 30 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న స్థానికులకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. రాజంపేట టీడీపీ ఇంచార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం రహదారి పనులు ప్రారంభమయ్యాయి. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ సమస్య ఆలస్యమైందని, గ్రామాల్లో సీసీ రోడ్లు, స్మశాన రహదారి పనులు చేపట్టడం శుభపరిణామమని టీడీపీ నేత రాజారాం తెలిపారు. స్థానికులు ఈ చర్యతో హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్