టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన విమర్శలు దారుణమని అన్నారు. నందలూరులో శనివారం ఆయన మాట్లాడుతూ, అంబటి రాంబాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.