రాజంపేట: కాపర్ వైర్ దొంగలు అరెస్టు – ASP

రైతుల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ చోరీకి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాజంపేట ASP మనోజ్ రామ్నాథ్ హెగ్దే తెలిపారు. శనివారం ఆయన స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చవనవారిపల్లెకు చెందిన లక్ష్మీనారాయణ, రవీంద్ర, సాతుపల్లెకు చెందిన మోహన్, రెడ్డయ్య ఈ చోరీలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. వీరిపై రాజంపేట, పుల్లంపేట మండలాల్లో మొత్తం 9 కేసులు ఉన్నాయని ASP వెల్లడించారు.

సంబంధిత పోస్ట్