రాజంపేట మండలం ఆకేపాడు గ్రామంలో ఆదివారం, అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో టీడీపీ గూండాల దాడులు ఆపాలని, రెడ్‌బుక్ రాజ్యాంగం నశించాలని వారు డిమాండ్ చేశారు.