రామయ్య కళ్యాణం.. ఒంటిమిట్టలో అద్భుత దృశ్యం

సీతారాముల వైభవాన్ని తిలకించడానికి రెండు కన్నులు చాలవు. అలాంటిది శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్టలో రాములోరి వేడుకలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. బుధవారం దశరథ కుమారుడి కళ్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. దేవతలే స్వామి వారి కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చారా అన్నట్లు పరిసరాలు మారాయి. ఎప్పుడు నిప్పులు చిమ్మే భానుడు సైతం సీతమ్మ, రామయ్యను దగ్గరి నుంచి వీక్షించడానికి వచ్చాడా అన్నట్లు దృశ్యం అవిష్కృతమైంది.

సంబంధిత పోస్ట్