ఓబులవారిపల్లి మండలం బాలిరెడ్డిపల్లి సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వరి ఆత్మహత్య ఘటనపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించినట్లుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. రాజంపేట సబ్ కలెక్టర్, పోలీస్ శాఖ అధికారులను ఆదేశించినట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి నివేదిక కోసం రాజంపేట సబ్ కలెక్టర్ ను, పోలీస్ అధికారులను కోరారు.