స్వాతంత్ర్య సమరయోధుడు, పేద బలహీన వర్గాల ఆశాజ్యోతి వడ్డే ఓబన్న మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన ఆశయాలు దేశానికి స్ఫూర్తిదాయకమని ఆదివారం వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ ప్రతినిధి శ్రీకాంత్ అన్నారు. సిద్దవటం మండలంలోని మాధవరం గ్రామంలో వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సాయుధ పోరాటంలో సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న కీలక పాత్ర పోషించారని, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించి ఆదర్శంగా నిలిచారని తెలిపారు.