గంజాయి విక్రయిస్తూ జూలై 5న పట్టుబడ్డ కడప నగరానికి చెందిన రెడ్డి సురేష్ విచారణలో మరి కొంత మంది పేర్లు చెప్పడంతో సిద్దవటం ఎస్ఐ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. సిద్దవటం మండలం మాధవరం, పార్వతీ పురం గ్రామాల్లోని శీతలగంగమ్మ గుడిఆలయం సమీపంలో ఆదివారం కడప నగరం ఎన్జీవో కాలనీకి చెందిన హేమవర్ధన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.