స్వచ్ఛ రాజంపేటే లక్ష్యం.. జీరో వేస్ట్ కార్యక్రమం నిర్వహణ

చెత్తను సంపదగా మార్చి స్వచ్ఛ రాజంపేటను స్వర్ణ రాజంపేటగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన “జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెత్త కేవలం వ్యర్థం కాదని, దాన్ని రీసైకిల్ చేసి సంపదగా మలచవచ్చని, చెత్త వర్గీకరణ, పునర్వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్